ఆ ఒక్క మాటతో.. ఆ సంగీత దర్శకుడు మరదలి మెడలో తాళి కట్టాడట?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమ పాటల తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. టాలీవుడ్ లో ఇలాంటి సంగీత దర్శకుల గురించి మాట్లాడుకోవాలంటే.. ముందుగా గుర్తొచ్చేది చక్రవర్తి. అందించిన పాటలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు మరువలేదూ అనే చెప్పాలి. చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎన్నో వందల సినిమాలకు సంగీతం అందించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడు చక్రవర్తి గా తెలిసిన ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు.

1936 సెప్టెంబర్ 8వ తేదీన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో బసవయ్య అన్నపూర్ణ దంపతులకు జన్మించారు ఆయన. అప్పట్లో పొన్నెకల్లు గ్రామం లో చదువు కున్న వాళ్లు చాలా తక్కువ. ఎంతలా అంటే ఊరు మొత్తంలో చదువుకున్నది కేవలం ఒక అప్పారావు మాత్రమే.. అందుకే ఊరి వాళ్ళు అందరూ ఆయనను ఎంతగానో అభిమానించేవారు. ఇక చిన్నప్పుడే తండ్రి మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర అప్పారావుకు సంగీతం నేర్పించారు. ఇలా అప్పారావుకి సంగీతంపై పట్టు వచ్చింది. ఇక సంగీత దర్శకుడు చక్రవర్తి అప్పట్లో ఒక ఆర్కెస్ట్రా బృందంలో కూడా పనిచేశారు. ఆ తరువాత తండ్రికి అది నచ్చకపోవడంతో 1954 నుంచి 58 మధ్య ఆలిండియా రేడియోలో పని చేశారు.

ఇక ఆలిండియా రేడియోలో ఆయన పాడిన పాటలకు ఎంతో గుర్తింపు వచ్చింది.. కానీ ఆయనలో ఏదో బాధ.. ఇక్కడికే జీవితం అయిపోతుందేమో.. ఈ విషయాన్ని మేనమామ కూతురు రోహిణి తెలుసుకుందట. వీరి మధ్య ప్రేమ కూడా ఉంది. ఇక బావ అప్పారావు దగ్గరికి వచ్చి నువ్వు సినిమాల్లోకి వెళ్ళు బావ అంటూ చెప్పింది. అంతే రోహిణి గొప్ప మనసును అర్థం చేసుకున్న అప్పారావు వెంటనే ఆమె మెడలో తాళి కట్టాడు. మద్రాసు రైల్వే ఎక్కేశాడు. ఇక్కడికొచ్చాక కొన్ని రోజులకి ఓ రికార్డింగ్ లో సంగీత దర్శకులు రాజన్, నాగేంద్ర ను కలిశారు. వారికి అప్పారావు పాటలు పాడి వినిపించగా.. అప్పారావు గొంతు వాళ్లని మంత్రముగ్ధులను చేసింది. ఇక కొన్ని పాటలు పాడిన అప్పారావు ఆ తర్వాత జయ విజయవాడ సినిమాలో పాడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఫలోమా అనే మలయాళ చిత్రం హిందీ డబ్బింగ్ లో అప్పారావు సంగీతదర్శకుడిగా తీసుకున్నారు. ఇక సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ హిందీ వాళ్ళే.. హిందీ పేర్ల మధ్య తెలుగు పేర్లు ఎందుకని ఆయన పేరును అప్పుడు చక్రవర్తి గా మార్చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన సంగీత దర్శకుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.