వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు … ?

కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75% వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. కొత్త మార్గదర్శకాలలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, టీకా సరఫరా షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత ప్రాధాన్యతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను తయారీ సంస్థలు మాత్రమే ప్రకటిస్తాయని ఆ మార్గదర్శకాలలో పేర్కొన్నారు. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత […]

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]