ఎమ్మెల్యేల కొనుగోలు..నీతులు ఎవరికి?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి అనూహ్యంగా 23 ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్సీగా గెలిచారు. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగగా..వైసీపీ 7 గురు అభ్యర్ధులని బరిలో దింపింది..టీడీపీ ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపింది..అయితే ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇక వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది..ఇక టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు. దీంతో వైసీపీ బలం […]

సైకిల్ సైలెంట్ విక్టరీ..బాబు ప్లాన్ ఎప్పటిది!

ఏపీ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది..ఇన్నాళ్లు విజయాలకు దూరమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలు వస్తున్నాయి. ఇటీవలే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన టి‌డి‌పి..తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పట్టభద్రుల స్థానాల్లో అధికార బలాన్ని ఎంత ఉపయిగించిన వైసీపీకి విజయం దక్కలేదు. ఆ ఎన్నికల్లో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అలాగే పి‌డి‌ఎఫ్ తో రెండు ప్రాధాన్యత ఓటుపై అవగాహన పెట్టుకుని అనూహ్యంగా గెలుపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే […]

 విశాఖ రాజధాని..జగన్‌కు ఉత్తరాంధ్ర షాక్..అసెంబ్లీలో రిపీట్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న రాజధాని అమరావతిని కాదని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి..అసలైన రాజధానిగా విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెప్పారు. ఇటు కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. అయితే ఇందులో మెయిన్ విశాఖనే. ఈ రాజధాని వెనుక రాజకీయ కోణం చాలా ఉంది. అది జనాలకు బాగా తెలుసు. అంతే తప్ప ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజధాని […]

కంచుకోటలపై పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..సైకిల్ జోరు!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట…అలాగే కోస్తా చివరిలో..రాయలసీమకు దగ్గరలో ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సైతం వైసీపీకి పట్టున్న జిల్లాలు గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ హవానే నడుస్తోంది. సీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం..ఈ ఉమ్మడి జిల్లాలని తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ జిల్లాలుగా చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పు రాయలసీమ అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలు…అటు పశ్చిమ రాయలసీమ అంటే కడప-కర్నూలు-అనంతపురం జిల్లాలు. 2014 ఎన్నికల్లో రెండు చోట్ల వైసీపీ […]

 కమ్యూనిస్టులతో సైకిల్..ఆ స్థానాల్లో మద్ధతు.!

మళ్ళీ చాలాకాలం తర్వాత తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిసి పనిచేయనున్నారు. ఎప్పుడో 2009 ఎన్నికల్లో టి‌డి‌పి-కమ్యూనిస్టులు పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ వారు కలిసి పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక..కమ్యూనిస్టులతో కలిసే కొన్ని సందర్భాల్లో ప్రజా పోరాటాలు చేశారు. సి‌పి‌ఐ…టి‌డి‌పికి మద్ధతుగా నిలుస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని టి‌డి‌పి-కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నాయి. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు..వైసీపీ స్కెచ్.!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పి గట్టిగానే పోరాడుతున్నాయి. మధ్యలో బి‌జే‌పి సైతం రేసులో ఉంది. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు ఉండే కమ్యూనిస్టులు కూడా పోటీపడుతున్నారు. కమ్యూనిస్టుల అనుబంధ సంఘంగా ఉన్న పి‌డి‌ఎఫ్ సైతం గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే […]

ఎమ్మెల్సీ ఆశ..వైసీపీలోకి జంపింగులు.!

ఏపీలో మరోసారి పదవుల పండుగ నడుస్తోంది. 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహులు వైసీపీ వైపు ఆశగా చూస్తున్నారు. 9 స్థానిక సంస్థల కోటాలో, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలో ఖాళీ ఉన్న 9 స్థానాలు డౌట్ లేకుండా వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైసీపీదే హవా ఉంది. ఇక గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కునే […]

ఉత్తరాంధ్ర టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ చిచ్చు..షాక్ తప్పదా!

ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్ట్ గాడిలో పడుతుందనుకుంటే..ఆ పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వాటిని నిదానంగా పరిష్కరించుకుంటూ చంద్రబాబు ముందుకెళుతున్నారు. కానీ కొన్ని చోట్ల రచ్చ తగ్గట్లేదు. ఇదే సమయంలో టి‌డి‌పి బలపడుతున్న ఉత్తరాంధ్రలోల్ ఊహించని ట్విస్ట్ వచ్చింది. పట్టబధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక టి‌డి‌పిలో చిచ్చు రేపింది. ఉత్తరాంధ్ర పట్టబధ్రుల స్థానానికి ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానంలో పోటీ […]

ఎమ్మెల్సీ పోరు: బీజేపీకి బాబు హెల్ప్?

ఇప్పటివరకు ఏపీలో జరిగిన అన్నీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే…టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పలు ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్దగా పోటీ చేయవు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే […]