స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]

నవంబర్ వరకు జైలులోనే నివాసం… నిజమేనా…?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే ఆయన నవంబర్‌ నెలలో బయటకు వస్తారని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ చంద్రబాబు కేసులకు వర్తిస్తుందని, అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసులు చెల్లవని వేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పును […]

బాబు ఇప్పట్లో బయటకు రానట్లేనా….!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పట్లో బయటకు రారా… ఆయన బయటకు రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది…. ఈసారి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు జైలులోనేనా… ప్రస్తుతం ఇవే ప్రశ్నలు టీడీపీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. పైకి మాత్రం మా నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నప్పటికీ… ఆ ముత్యం ఎప్పుడు అవుతుందో.. ఎప్పుడు బయటకు వస్తారని అడిగితే మాత్రం… నో కామెంట్ అనేస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న […]

తెలుగుదేశం పార్టీలో కొత్త లీడర్ వచ్చేశారు…!

తెలుగుదేశం పార్టీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ చేశారనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 42 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుపై మరి కొన్ని కేసులు కూడా సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు […]

చంద్రబాబు లేకుండానే తొలి భేటీ… అందుకేనా…!

టీడీపీ సర్వ సభ్య సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా చంద్రబాబు లేకుండా జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాబు షూరిటీ…. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించడం, నిజం గెలవాలి అనే నినాదంతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటనల పై చర్చించనున్నారు. మాజీ మంత్రి లోకేష్ నేతృత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ […]

టీడీపీలో వేరు కుంపట్ల గోల… ఇలా అయితే అయినట్లే….!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వేరు కుంపట్లు ఎక్కువయ్యాయి. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే లక్ష్యంతో ప్రతి ఒక్కరు పని చేయాలని నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం కూడా చేశారు. అయితే తాజాగా పార్టీ నేతల తీరు చూస్తే మాత్రం అధినేత మాటను ఏ మాత్రం లెక్క చేస్తున్నట్లుగా లేదు. ఇందుకు ప్రధాన కారణం… పార్టీలో […]

టీడీపీని నడిపించే నేత ఎవరూ….?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందంటూ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. ఇప్పటికే నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు సీఐడీ అధికారులు కూడా ఇప్పటికే చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా నెల రోజులుగా వరుస నిరసనలు చేస్తున్నారు. […]

లోకేష్ పాదయాత్ర రీస్టార్ట్..బ్రాహ్మణి ఎంట్రీ అక్కడే.!

లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలుకానుంది. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ పునః ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ రాజోలులో పాదయాత్ర చేస్తూ మధ్యలోనే ఆపేశారు. ఇక తన తండ్రి కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది..కానీ బాబు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికీ ఆయన కేసులు వ్యవహారం ముందుకెళుతూనే ఉంది. అయితే న్యాయ పోరాటం కొనసాగిస్తూనే..పార్టీ పరమైన విషయాల్లో కూడా దూకుడు […]

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… సోషల్‌ మీడియాలో వైరల్‌…!

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… అంటూ కన్యాశుల్యంలో నాటకంలో గిరీశం చెప్పిన డైలాగు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిజమే… ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, […]