రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్‌ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే […]

ప‌వ‌న్ – బాల‌య్య ల‌క్కీ బాబులే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ నయా ల‌క్ ద‌క్కించేసుకున్నారు. టాలీవుడ్‌లో సినిమాల‌కు టాప్ సీజ‌న్ ఏదంటే సంక్రాంతి సీజ‌నే. సంక్రాంతి సీజ‌న్ వ‌స్తే ఇక పండ‌గే పండ‌గ‌. ఒకేసారి రెండు మూడే కాదు ఇటీవ‌ల నాలుగు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. గ‌త రెండు సంక్రాంతి సీజ‌న్ల‌కు అయితే ఒకేసారి మూడు, నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చి అన్ని హిట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే 2018 సంక్రాంతికి ముందుగా నాలుగైదు పెద్ద […]

బాల‌య్య 102కు సెంటిమెంట్ టైటిల్ ఫిక్స్‌

యువ‌ర‌త్న‌, నంద‌మూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమా టైటిల్ ఫిక్స‌యిపోయింది. ముందునుంచి ఈ సినిమాకు క‌ర్ణ అనే టైటిల్ ఫిక్స‌యిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ టైటిల్‌పై బాల‌య్య ఫ్యాన్స్ నుంచి అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు. ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్టుకు ఎట్ట‌కేల‌కు టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా, […]

బాల‌య్యా ఇదేం జోర‌య్యా… లైన్లో మ‌రో రెండు సినిమాలు 

ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో 100 సినిమాలు పూర్తి చేసిన నటుడు బాలకృష్ణ తర్వాత వేగం పెంచాడు. ఆ వెంట‌నే నాలుగైదు నెల‌ల గ్యాప్‌లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా చేశాడు. ఆ వెంట‌నే జెట్ స్పీడ్‌తో కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ర్ణ (వ‌ర్కింగ్ టైటిల్‌) సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌ర్ణ సినిమాను సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి దింపేందుకు రెడీ అవుతున్నాడు. క‌ర్ణ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన […]

బాల‌య్య 102కు ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా కుర్రాళ్ల‌తో పోటీప‌డుతూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది సంక్రాంతికి త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టిన బాల‌య్య తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి త‌క్కువ టైంలోనే పైసా వ‌సూల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పైసా వ‌సూల్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంట‌నే బాల‌య్య త‌న 102 సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు. కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ […]

బాలయ్య 102 కి విలన్ దొరికేసాడు

నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పైసా వ‌సూల్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో త‌న 102వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు రెండో వారం నుంచి స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ […]

” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే

యంగ్ టైగ‌ర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్‌! ఇప్పటికే హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాల‌కు తార‌క్ ఓటేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించిన తార‌క్‌.. ఈ సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒక‌టి తండ్రి పాత్ర కాగా.. మ‌రో రెండు పాత్ర‌ల్లో క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. జ‌న‌తాగ్యారేజ్‌ […]

బాల‌య్య 101వ సినిమా ఫిక్స్‌.. టైటిల్స్ కూడా రెడీ

త‌న 100వ సినిమా `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి`తో తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక పేజీని చిర‌స్థాయిగా నిలుపుకున్న నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌.. త‌దుప‌రి సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆయ‌న అభిమానుల‌కు శుభ‌వార్త‌!! ఆయ‌న 101 సినిమా దాదాపు ఖ‌రారైనట్లు స‌మాచారం! ముఖ్యంగా ఈ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించినా.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కృష్ణ‌వంశీ స్థానంలో త‌మిళ ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్ తెర‌పైకి వ‌చ్చాడు. బాల‌య్య కూడా […]

బాలయ్యను మెప్పించిన తమిళ డైరెక్టర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య గ‌త సినిమాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టికే రూ.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. శాత‌క‌ర్ణి విజ‌యం ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వించేలా ఉంది. ఈ గ్రాండ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాల‌య్య ఇప్పుడు త‌న 101వ సినిమాపై దృష్టి సారిస్తున్నాడు. బాల‌య్య 101వ సినిమాగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా ఉంటుంద‌ని […]