కాంగ్రెస్‌కు కేసీఆర్ రివర్స్ స్కెచ్..జంపింగులు షురూ.!

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఊహించని మైలేజ్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇలా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ సైలెంట్ గా ఉండరు కదా..కాంగ్రెస్ కు చెక్ పెట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ని చావు […]

జంపింగులకు సీటు ఫిక్స్..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం చేపట్టాలని కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కే‌సి‌ఆర్ పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అయితే ముందే ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే అభ్యర్ధులని ఖరారు చేశారని, ఆగష్టులో మొదట లిస్ట్ విడుదల చేశారని తెలిసింది. అధిక […]

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హ్యాండ్.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న సి‌ఎం కే‌సి‌ఆర్..అభ్యర్ధుల లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ ఆగష్టు నెలలోనే కే‌సి‌ఆర్ అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేస్తారని తెలిసింది. 75 మందితో మొదటి లిస్ట్ వదులుతారని సమాచారం..అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తామని కే‌సి‌ఆర్ పలుమార్లు చెప్పారు. […]

కమలం మళ్ళీ రేసులోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్.!

తెలంగాణలో గత కొంతకాలం నుంచి బి‌జే‌పి సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కీలక మార్పులు..అధ్యక్షుడుని మార్చడంతో కొంత అనిశ్చితి పరిస్తితులు నెలకొన్నాయి. అలాగే అనూహ్యంగా ఆ పార్టీ రేసులో వెనుకబడింది. ఇటు కాంగ్రెస్ ముందుకొచ్చింది. అయితే అంతకముందు బి‌జే‌పి పైకి లేవడానికి కే‌సి‌ఆర్ చేసిన రాజకీయమే కారణమని, అలా బి‌జే‌పిని పైకి లేపితే కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలుస్తుందని దాని ద్వారా బి‌ఆర్‌ఎస్ కు లాభమని విశ్లేషణలు వచ్చాయి. […]

రేవంత్ లాజికల్ కౌంటర్స్..బీఆర్ఎస్‌కు చిక్కులు.!

తెలంగాణ రాజకీయాల్లో అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమైంది. ఇదే క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మరింత ఊపులో ఉంది. వలసల జోరుతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ చెక్ పెట్టేస్తుందనే కోణంలో రాజకీయం వస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి..అమెరికా లో ఉచిత […]

రాహుల్‌కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది. ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. […]

మోదీ..డైరక్ట్ కేసీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేశారు.!

విపక్షాల ఐక్యతతో దేశంలో బి‌జే‌పికి కాస్త ఇబ్బందులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న మోదీ సర్కార్‌కు విపక్షాల ఐక్యత రూపంలో ఓ భారీ కుదుపు కనిపిస్తుంది. విపక్షాల కూటమి కట్టడాన్ని మోదీ తెలిగా వదిలేస్తున్నట్లు లేరు. విపక్షాలు అదే విధంగా కలిసి ముందుకెళితే రానున్న కాలంలో తమకే ఇబ్బంది అని అర్ధమైంది. అందుకే డైరక్ట్  విపక్షాలని మోదీ టార్గెట్ చేశారు. తాజాగా భోపాల్ లో బీజేపీ బూత్ లెవెల్ నేతలు, కార్యకర్తలతో […]

బాబు మాట కేసీఆర్ నోట..ఏపీ విలువ దిగజారిందా?

ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో […]

కేసీఆర్‌కు అసదుద్దీన్ ఎసరు..పోటీకి ఎం‌ఐ‌ఎం రెడీ.?

ఇంతకాలం కేసీఆర్‌కు అనుకూలంగా రాజకీయం చేస్తూ..పరోక్షంగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచిన ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వరం మారుతుంది. ఈ సారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు..బరిలో దిగి బి‌ఆర్‌ఎస్‌కు నష్టం చేసేలా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎం‌ఐ‌ఎం కేవలం తమకు పట్టున్న పాతబస్తీ సీట్లలోనే పోటీ చేసేది. అక్కడ ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూరపురా, యాకుతపురా,  నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్ సీట్లని ఎం‌ఐ‌ఎం గెల్చుకునేది. ఈ సీట్లలో ఎం‌ఐ‌ఎం గెలుపుకు బి‌ఆర్‌ఎస్ […]