తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ […]

కాంగ్రెస్‌లో ‘బీసీ’ ఇష్యూ..సీట్లు లేవా?

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఎంపిక పెద్ద టాస్క్ అయిపోయింది. ఓ వైపు బి‌ఆర్‌ఎస్ సీట్లు ఖరారు చేసుకుని దూసుకెళుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకో సీటుకు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. కొన్ని సీట్లకు పది మందిపైనే పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. అందులో ఆర్ధికంగా, […]

కమలంలో కల్లోలం..కాంగ్రెస్‌కు ప్లస్.!

కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బి‌జే‌పినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బి‌జే‌పి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో […]

ఆరు గ్యారెంటీలు..కాంగ్రెస్ ఆశలు ఇవే.!

ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలని కోరుతున్నారు. తెలంగాణ పొరాడి సాధించారని కే‌సి‌ఆర్‌ని రెండుసార్లు ప్రజలు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ప్రజలు ఒక్కసారి ఆదరించాలని కోరుతున్నారు. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి పార్టీని ఢీకొట్టి అధికారం సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ […]

కేవీపీ-కిరణ్‌లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!

తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టి‌డి‌పి పొత్తు పెట్టుకుంది. దీన్ని కే‌సి‌ఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]

35  సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్‌కు అవే తలనొప్పి.!

తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు […]

కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..కలిసొస్తుందా?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పైగా జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అది కూయ హైదరాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు..కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే 17వ తేదీన బహిరంగ సభ […]

తుమ్మలతో రేవంత్..హస్తం గూటికే..సీటుపైనే చర్చ.!

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..నాలుగు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి చూస్తున్నారు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పార్టీ మార్పుపై ప్రచారం జరిగిన అది ఆచరణ కాలేదు. కానీ ఇప్పుడు ఆచరణ అయ్యే దిశగా వెళుతుంది. తుమ్మలని తాజాగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. దీంతో తుమ్మల కాంగ్రెస్ […]

కాంగ్రెస్‌లోకి తుమ్మల..షర్మిలకి నో క్లారిటీ?

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కే‌సి‌ఆర్ ప్రకటించడంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరి కొందరు అదే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో టి‌డి‌పిలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు బి‌ఆర్‌ఎస్ లో అనుకున్న మేర […]