వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]

ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

నవంబర్ వరకు జైలులోనే నివాసం… నిజమేనా…?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే ఆయన నవంబర్‌ నెలలో బయటకు వస్తారని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ చంద్రబాబు కేసులకు వర్తిస్తుందని, అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసులు చెల్లవని వేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పును […]

బాబు ఇప్పట్లో బయటకు రానట్లేనా….!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పట్లో బయటకు రారా… ఆయన బయటకు రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది…. ఈసారి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు జైలులోనేనా… ప్రస్తుతం ఇవే ప్రశ్నలు టీడీపీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. పైకి మాత్రం మా నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నప్పటికీ… ఆ ముత్యం ఎప్పుడు అవుతుందో.. ఎప్పుడు బయటకు వస్తారని అడిగితే మాత్రం… నో కామెంట్ అనేస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న […]

టీడీపీని నడిపించే నేతలే లేరా…..!?

తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీని ముందుండి నడిపించే నేత కరువయ్యాడా అనే మాట ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిదంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ […]

లోకేశ్ ఢిల్లీలోనే ఎందుకున్నట్లు… వస్తే ఏమవుతుంది….!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడున్నారు…. ఆయన కూడా అరెస్ట్ అవుతారా… లోకేశ్ పారిపోయారా… ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న మాట ఇదే. ఓ వైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ అవినీతి జరిగిదంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు రోజుల పాటు సుధీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయనను రాజమండ్రి […]

చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన సీన్.. గ్రాఫ్ పెరిగిందా….?

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ పట్ల సానుభూతి పెరుగుతూ వస్తుంది. టీడీపీ అధినేతను కక్ష పూరితంగా అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం జైలుకి పంపిందని వివిద వర్గాలకి చెందిన వారు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చట్టం దాని పని అది చేసుకుపోతుందని…. తప్పు చేసిన […]

అసెంబ్లీ సమావేశాలు… టీడీపీ వ్యూహం ఏమిటో…?

ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలుంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకువస్తున్న నేపథ్యంలో… దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని […]

అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!

నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి […]