ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ క‌థ‌.. రాష్ట్రానిది మ‌రో స్టోరీ!!

విభ‌జ‌న అనంత‌రం ఏర్ప‌డ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉంద‌ని, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం దీనిని కేంద్ర‌మే పూడ్చాల‌ని ప‌దే ప‌దే లెక్క‌లు చెప్తూ వ‌స్తోంది రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామ‌ని కొద్దో గొప్పో మాత్ర‌మే బ‌కాయి ఉంద‌ని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవ‌రి మాట న‌మ్మాలో ప్ర‌జ‌లకు అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయ‌డం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుద‌ల చేయాల్సింది మ‌రో రూ. 138 […]

ప్యాకేజీ బండారం బ‌య‌ట ప‌డుతోంది!

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఎదురు చూస్తున్న త‌రుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్ర‌బాబు స‌హా ఆయ‌న మందీ మార్చ‌లం పెద్ద ఎత్తున ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లించారు. తీరా ప్యాకేజీ వ‌చ్చి ఆరు మాసాలు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఎలాంటి హామీ కార్య‌రూపం దాల్చ‌లేదు. స‌రిక‌దా ప్యాకేజీకి చ‌ట్ట బ‌ద్ధ‌త హుష్ కాకి అన్న‌చందంగానే మారిపోయింది. ఈ విష‌యంలో గ‌డుసుగా మాట్లాడిన బీజేపీ నేత‌.. ఆర్థిక మంత్రి […]

ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]

ఆంధ్రప్రదేశ్‌కి రెండు లక్షల కోట్లు.

కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ, ఇప్పటివరకు చేసిన సాయం, ఇకపై చేయనున్న సాయం గురించి సవివరంగా చెప్పారుగానీ, ఇదంతా దేనికోసం? అన్న చర్చకు తావిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్‌ జైట్లీ ఏదో చెప్పేస్తారనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజానీకం ఎదురు చూడగా, అర్థరాత్రి వేళ తుస్సుమనిపించారు అరుణ్‌ జైట్లీ. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచీ హైడ్రామా నడిపించారు. […]

చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]

ప్రత్యేక హోదానా వంకాయా:జైట్లీ

ప్రత్యేక హోదాపై అధికార పక్షం చాలా క్లారిటీగా వుంది.చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజం ఉంటుందో లేదో కానీ ఇంత క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ వేదన అరణ్య రోదనే..నిన్న బొంకయ్య నాయుడుగారు బొంకిన బొంకులే ఈ రోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు కూడా ఇంకొంచెం పోలిష్ చేసి వల్లెవేశారు. అసలు చర్చే ప్రత్యేక హోదా గురించి అయితే ఎంతసేపు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం […]