ప్యాకేజీ పాఠాలు నేర్పనున్న చంద్రబాబు 

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం అని మాత్రమే ప్రకటన చేసినప్పటికీ, దాన్ని ప్యాకేజీగా చెప్పేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ అంతా ప్రజలకు పాఠాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నద్ధమయ్యారట. ఓ వైపున పార్టీల పరంగా టిడిపి, బిజెపి ఇప్పటికే ప్యాకేజీ అనబడే సాయంపై ప్రచారం మొదలు పెట్టాయి. ఇంకో వైపున ప్రభుత్వ పరంగా ప్రజలలకు ప్యాకేజీ లాభాల్ని తెలియజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ ముఖ్య నేతలతోనే కాకుండా, క్యాబినెట్‌లోనూ ఈ అంశాలపైనే ముఖ్యంగా చర్చ జరిగిందని సమాచారమ్‌. […]

ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్‌.

విభ‌జ‌న పాపంలో పార్ల‌మెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ పార్టీతో పోటీప‌డి మ‌రీ బీజేపీ పాలు పంచుకున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మ‌ర‌చిపోలేదు. అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక  విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకుంటామ‌ని చెప్పిన‌ బీజేపీ నేత‌ల హామీల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఫ‌లితంగానే ఏపీలో బ‌ల‌మైన పునాదులు ఉన్న కాంగ్ర‌స్ పార్టీని చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మ‌రీ టీడీపీ, బీజేపీ కూట‌మికి అధికారం అప్ప‌గించారు.. అయితే  అధికారం చేజిక్కాక, […]

హోదా – తల్లిపాలు, ప్యాకేజీ – డబ్బా పాలు.

డబ్బా పాలు చంటి పిల్ల ఆరోగ్యానికి క్షేమం కాదు. కానీ విధిలేని పరిస్థితుల్లో వైద్యులు డబ్బా పాలను పసి పిల్లలకు ఆహారంగా సూచిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ అనే పసిపాపకి ఇప్పుడు డబ్బా పాల అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనే తల్లిని కేంద్రమే దూరం చేసింది. దారుణం కదా ఇది. ఈ పోలిక తెచ్చింది బిజెపి మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్‌. చిత్తూరు జిల్లాకు చెందిన శివప్రసాద్‌, రాజకీయ నిరసనల కోసం సరికొత్త […]

ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]

ఆంధ్రప్రదేశ్‌కి రెండు లక్షల కోట్లు.

కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ, ఇప్పటివరకు చేసిన సాయం, ఇకపై చేయనున్న సాయం గురించి సవివరంగా చెప్పారుగానీ, ఇదంతా దేనికోసం? అన్న చర్చకు తావిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్‌ జైట్లీ ఏదో చెప్పేస్తారనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజానీకం ఎదురు చూడగా, అర్థరాత్రి వేళ తుస్సుమనిపించారు అరుణ్‌ జైట్లీ. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచీ హైడ్రామా నడిపించారు. […]