మొద‌టి రోజే విమ‌ర్శ‌ల పాలైన మ‌హిళా మంత్రి.. అధిష్టానం సీరియ‌స్‌!

సీఎం జ‌గ‌న్ అనేక ల‌క్ష్యాల‌తో 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది సీనియ‌ర్ల‌ను .. ఆశా వ‌హుల‌ను.. పార్టీకి ఎంతో కృషి చేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్టి.. ఆయ‌న కొంద‌రు జూనియ‌ర్ల‌ను కేబినెట్ 2.0లో చేర్చుకున్నారు.వీరంతా బాగా ప‌నిచేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి.. వ‌రుస విజ‌యం అందుకుని.. మ‌ళ్లీ సీఎం కావాల‌ని.. జ‌గ‌న్ ఆకాంక్షించారు. ఈ క్ర‌మంలోనే కొత్త అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వాస్త‌వానికి ఇలాంటి వారిని కేబినెట్‌లోకి […]

అమ్మ ఒడిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం…!

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల్లో అమ్మ ఒడి ప‌థ‌కం కూడా ఒక‌టి. నిజా నికి అన్ని ప‌థ‌కాల కంటే.. కూడా.. మ‌హిళ‌ల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన ప‌థ‌కం కూ డా ఇదే. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థ‌కాన్ని.. వ‌రుస‌గా రెండు సంవ‌త్సరాలు విజ‌య‌వం తంగా అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద‌.. రూ.15000ల‌ను బిడ్డ‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపించే త‌ల్లుల‌కు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]

ఈ నెల 10న జ‌గ‌న్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్య‌స‌భ క‌న్‌ఫార్మ్ మాట నిజం..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జ‌గ‌న్‌.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన‌ట్టు తాడే ప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు?  రీజ‌నేంటి? అనే అంశాలు చాలా ఆస‌క్తిగా మారా యి. ఎందుకంటే.. గ‌త నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన ఆయ‌న సీఎంతో క‌లిసి భోజ‌నం కూడా […]

ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?

పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]

అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!

గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]

మోహన్ బాబు సంచలన ప్రకటన …కొత్త యూనివర్సిటీ స్థాపన ,పేరు ఏమిటంటే !

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తెలియన వారెవ్వరూ ఉండరు . వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయ్యిన మోహన్ బాబు ఏది చేసిన ఒక సంచలమే . రీసెంట్ గా జరిగినా మా ఎలక్షన్స్ గొడవలు , ఏపీ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్లు వివాదం జరుగుతున్న ‘మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించలేదు .కానీ మోహన్ బాబు కంటి తుడుపుగా ఒక లెటర్ రాసి సరిపెట్టుకున్న్నారు .అయితే ఇండస్ట్రీలో టికెట్ రేట్లు గురించి […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]

సినిమా టికెట్ ధరలపై చెప్పకనే చెప్పేసిన జగన్

ఏపీలో సినిమా ధరల తగ్గింపు, టికెట్లను ప్రభుత్వమే విక్రయించడం.. సౌకర్యాలు లేని థియేటర్లను సీజ్ చేయడం .. లాంటివి కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేశారు. ఇక వీటికితోడు తక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే థియేటర్ నిర్వహణ కూడా కష్టమవుతుందని కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎవ్వరూ నేరుగా ఖండించడం లేదు. సినిమా పెద్దలైతే మంచి రోజులొస్తాయి.. సీఎం నిర్ణయం […]

దొందూ దొందే.. ఎన్ని సార్లు కలిసినా ఏమీ తేలదు!

సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న […]