పెళ్లిపై అవసరాల శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్..

ఉన్నత చదువు చదివి సినిమాల్లోకి అడుగు పెట్టాడు అవసరాల శ్రీనివాస్. భాగ్యనగరంలో పుట్టి పెరిగిన ఈ కుర్రాడు.. మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాడు. అయితే తనకు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కారణంగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. 2008లో తొలిసారి వెండి తెర మీద కనిపించాడు. అష్టాచెమ్మా సినిమాతో నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా రకరకాల పాత్రలు పోషించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు.

తాజాగా అవసరాల శ్రీనివాస్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో మీ పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు డబ్బులు లేని కారణంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. తాజాగా మళ్లీ తన పెళ్లి గురించి రియాక్ట్ అయ్యాడు. తను పెళ్లి అవసరం లేదని చెప్పాడు. పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. దాని వెనుక పెద్ద కారణాలు కూడా ఏమీ లేవన్నాడు. పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పినప్పుడు తన తండ్రి జెలస్ ఫీలైనట్లు వెల్లడించాడు. తన నిర్ణయం ఆయనకు బాగా నచ్చిందని చెప్పాడు.

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కొంత మంది మంచి నిర్ణయం అంటుంటే.. మరికొంత మంది మాత్రం పెళ్లి పెటాకులు లేని జీవితం ఏం జీవితం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది తప్పకుండా ఉండాలి అంటున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే అవసరాల శ్రీనివాస్ చివరిగా నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంతో జనాల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. శ్రీనివాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.