మరో సిరీస్ ను గెలుచుకోవటానికి.. సిద్ధమవుతున్న భారత్…!

ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ ను గెలుచుకున్న భారత్.. ప్రస్తుతం తన తర్వాత సిరీస్ లకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ ముందు చివరిగా దక్షిణాఫ్రికా తో మూడు టి20 మ్యాచ్లను భారత్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ను కూడా భారీ విజయంతో టి20 వరల్డ్ కప్ కు వెళ్లాలని టీమిండియా సన్నాహాలు చేస్తుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో పాటు దీపక్ హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మహ్మద్ షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేష్ యాదవ్ దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగం కానున్నాడు. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో ఎంతో అద్భుత ప్రదర్శన ఇచ్చిన‌ ఇమ్రాన్ మాలిక్‌కు జట్టులో చోటు దక్కలేదు.

IND vs SA Live Update: When And Where To Watch India Vs South Africa T20I Series?

దక్షిణాఫ్రికా vs భారత్ మధ్య జరిగే మ్యాచ్ వివరాలు ఇవే..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తోలి మ్యాచ్ సెప్టెంబర్ 28న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. దీంతో రెండు జట్లకు మూడు రోజుల విరామం వ‌చ్చింది. రెండో టీ20 అక్టోబరు 2న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 4న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు-

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), రవి అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమేష్ యాదవ్ హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

India vs South Africa T20I: Date, Time, Schedule, Ticket Price, Venue, Ticket Details, IND vs SA T20 Match Series Details Here

భారత్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు..

టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జన్మాన్ మలన్, ఐదాన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, తబ్సోరిజ్ రైస్‌బాసి.

India vs South Africa 3rd ODI 2015 Highlights