ర‌ష్మిక‌ను బాలీవుడ్ నుంచి త‌రిమికొడ‌తాం.. కేఆర్‌కే ఘాటు వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాను బాలీవుడ్ నుంచి త‌రిమికొడ‌తాం అంటూ దారుణ‌మైన కామెంట్లు చేశారు. మ‌ధ్య‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా లాగుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు.

`మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది` అంటూ కించపరిచే విధంగా కేఆర్‌కే ట్వీట్ చేశాడు.

దీంతో అత‌డి ట్వీట్ పై అటు ర‌ష్మిక ఫ్యాన్స్‌, ఇటు విజ‌య్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిప‌డుతున్నాడు. గతంలోనూ కేఆర్‌కే పలువురు బాలీవుడ్‌ స్టార్లపై అనేక నెగెటివ్ కామెంట్లు చేసి.. విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. అయినా స‌రే అత‌ని తీరును మార్చుకోలేదు. తాజాగా ర‌ష్మిక‌పై నెగ‌టివ్ కామెంట్స్ చేయ‌డంతో.. కేఆర్‌కే ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. కాగా, ర‌ష్మిక నుంచి ఈ నెల‌లో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో త‌మిళ చిత్రం వార‌సుడు ఒక‌టి కాగా.. మ‌రొక‌టి బాలీవుడ్ మూవీ మిష‌న్ మ‌జ్ను. ఇందులో మిష‌న్ మ‌జ్ను చిత్రం నేరుగా ఓటీటీలో విడుద‌ల కానుంది.