ర‌వితేజ రేటు పెంచేశాడుగా…

రాజా ది గ్రేట్ విడుదల తరువాత హీరో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. రెండేళ్ల క్రితం బెంగాల్ టైగ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆ త‌ర్వాత జ‌నాలు మ‌ర్చిపోవ‌డంతో ఎట్ట‌కేల‌కు రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాల‌కు రెడీ అవుతున్నాడు. ట‌చ్ చేసి చూడు సినిమాలో న‌టిస్తోన్న ర‌వితేజ ఆ వెంట‌నే యూవీ క్రియేష‌న్స్‌, బండ్ల గ‌ణేష్ బ్యాన‌ర్‌లో సినిమాల‌కు ఓకే చెప్పిన‌ట్టు వినికిడి. రాజా […]

ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్‌… ప‌వ‌న్‌ను ఎట్రాక్ట్ చేసింది ఇదే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. సోమ‌వారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజ‌రయ్యారు. టాలీవుడ్ ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో టాప్ హీరోలుగా ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఇలా ఒకే వేదిక‌మీద క‌న‌ప‌డ‌డం అరుదైన సంఘ‌ట‌న‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట‌ర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌న్‌కు చాలా స‌న్నిహితుడు […]

నాగార్జున వ‌ర్సెస్ అనుష్క‌…. త‌ప్ప‌దా..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజ‌మ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కార‌ణం కింగ్ నాగార్జునే అన్న‌ది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విష‌యం. సూప‌ర్ సినిమాతో అనుష్క‌ను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజ‌మ్మ‌గా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌. నాగార్జున అంటే అనుష్క‌కు ఎంతో రెస్పెక్ట్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వ‌ర్సెస్ అనుష్క ఈ ఇద్ద‌రి మ‌ధ్యా […]

ఎన్టీఆర్ కోసం ప‌వ‌ర్‌స్టార్‌

నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కోసం యావ‌త్ టాలీవుడ్ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. జై ల‌వ‌కుశ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్‌మీద‌కు వెళుతుందా ? అని వెయిట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో సినిమా తెర‌కెక్కిస్తోన్న త్రివిక్ర‌మ్ ఈ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నాడు. ఇదిలా ఉంటే మధ్య‌లో గ్యాప్ రావ‌డంతో […]

‘ రాజా ది గ్రేట్ ‘ 4 డేస్ గ్రాస్ & షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా త‌న ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని రాజా ది గ్రేట్ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో హిట్ సినిమాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ర‌వితేజ పూర్తి అంధుడిగా న‌టించిన ఈ సినిమా నాలుగు రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.15.73 కోట్ల షేర్ వసూలు చేసిందని […]

ప‌వ‌న్ అస‌లును వ‌దిలేసి కొస‌రుతో వేలాడుతున్నావేంటి…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ ( తెలుగులో అదిరింది ) గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మెర్స‌ల్‌లో జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా గురించి విజ‌య్ పేల్చిన డైలాగులు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని, మోడీ గ‌వ‌ర్న‌మెంట్‌ను టార్గెట్ చేసేలా ఉండ‌డంతో వీటిపై పెద్ద ఎత్తున రాజ‌కీయంగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు బీజేపీ వాళ్లు ఈ డైలాగులు తొల‌గించాల‌న్న డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్య‌పై స్పందించిన క‌మ‌ల్‌హాస‌న్ బీజేపీ వాళ్ల‌పై విమ‌ర్శ‌లు […]

టాలీవుడ్‌లో సీక్వెల్స్ సినిమాల‌ చీటింగ్‌

సినిమా అంటే.. స‌మాజంపై పెను ప్ర‌భావం చూపించే ప్ర‌ధాన మాధ్య‌మం. ఇప్పుడు ఎన్ని సాంకేతిక మాధ్య‌మాలు ఉర్రూత‌లూగుతున్నా.. సినిమా ప్ర‌భావం ఎటూ క‌ద‌ల‌కుండా అలానే ఉంది. ఇప్ప‌టికీ జ‌నాల నోటి వెంట సినిమా డైలాగులు ఆసువుగా వ‌చ్చేస్తున్నాయంటే.. మూవీ మ్యాజిక్ అంతా ఇంతా అని చెప్ప‌లేం. అయితే, రానురాను మూవీలు జ‌నాలను చీటింగ్ చేస్తున్నాయ‌నే టాక్ వ‌స్తోంది. ఇట‌వ‌ల కాలంలో సీక్వెల్ పేరుతో వ‌స్తున్న మూవీల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. అగ్ర హీరో నుంచి చిన్నా చిత‌కా […]

బాక్సాఫీస్ బరిలో బాలయ్య చిరు మరోసారి!

కొన్ని దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ సినీ ప్రియులను అలరిస్తున్న ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోల మ‌ధ్య మ‌రోసారి అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో ప‌లుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో పోటీప‌డుతున్నారు. కుర్రహీరోల హ‌వా కొన‌సాగుతోన్న టైంలో కూడా వీరిద్ద‌రు ఈ సంక్రాంతికి త‌మ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150 (చిరు 150వ సినిమా), గౌత‌మీపుత్ర […]

విజ‌య్ ‘ మెర్స‌ల్‌ ‘ కు అదిరే వ‌సూళ్లు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న తమిళనాట విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను తెలుగులో 19న అదిరింది పేరుతో నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి సెన్సార్ ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతో తెలుగులో అదిరింది సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయ‌లేక‌పోయారు. తెలుగు వెర్ష‌న్ అదిరిందిని అక్టోబ‌ర్ 27కు వాయిదా వేశారు. ఇక దీపావ‌ళి కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా […]