వెంకీ స్పీడు పెంచేశాడు

వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్‌ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా […]

లోకేష్‌ ఉత్తమాటలా? గట్టిమాటలా?

టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ గడ్డ మీద నుంచి లోకేష్‌ సహా తెలుగుదేశం పార్టీని తరిమేసినట్లయ్యింది పరిస్థితి ఇప్పటికే. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలే కాకుండా ఖమ్మం, వరంగల్‌, నారాయణ్‌ఖేడ్‌, మెదక్‌ ఉప ఎన్నికల్లో ఫలితాలు తెలుగుదేశం పార్టీని వెక్కిరించాయి. దాంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా నీరసించిపోయింది. అయితే పార్టీలు […]

సూపర్‌ స్టార్‌ అల్లుడు సూపరండీ

తమిళ సినీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కూడా అక్కడ స్టార్‌ హీరోనే. విలక్షణమైన నటతో విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలు చేస్తుంటాడు ధనుష్‌. కమర్షియల్‌ సినిమాల జోలికి వెళ్ళడు. కానీ తను చేసే సినిమాలతో కమర్షియల్‌ విజయాలు అందుకుంటుంటాడు. కథల ఎంపికలో మొదటి నుంచీ ధనుష్‌ది విలక్షణమైన తీరు. ఈ యంగ్‌ హీరో బాలీవుడ్‌లో కూడా నటించాడు. తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. నటన మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ధనుష్‌ […]

‘శాతకర్ణి’పై బాలీవుడ్‌ ఇంట్రెస్ట్‌

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా ఈ సినిమా డబ్‌ కానుంది. అయితే క్రిష్‌కి తమిళంతో పాటు హిందీలో కూడా బాగా ఫాలోయింగ్‌ ఉంది. బాలీవుడ్‌లో క్రిష్‌ అక్షయ్‌కుమార్‌, శృతిహాసన్‌, కరీనాకపూర్‌తో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అక్కడ విజయం […]

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సాము. అలాగే ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైతే మళ్ళీ పరీక్ష రాయడం అనేది కష్టసాధ్యం. విద్యార్థి లోకం పోటీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్ని ఎందర్నో చూస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందని తెలంగాణ సిఐడి స్పష్టం చేయడంతో ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహణ జరుగుతుందనే ప్రచారం కారణంగా విద్యార్థి […]

టాలీవుడ్‌, బాలీవుడ్‌ని సుధీర్‌ చుట్టేస్తాడా?

మారుతి డైరెక్షన్‌లో వచ్చిన సుధీర్‌ బాబు సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్‌’ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘భలే మంచి రోజు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్‌ బాబు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అక్కడ ‘బాఘీ’ సినిమాలో విలన్‌గా నటించాడు. హీరోకి ధీటుగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించి బాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాతి నుండి తెలుగులో కూడా సుధీర్‌ బాబుకి నెగిటివ్‌ రోల్స్‌ […]

జక్కన్న TJ రివ్యూ

సినిమా :జక్కన్న టాగ్ లైన్:ఇది పెద్ద తిక్కన్నా TJ  రేటింగ్ :0.5/5 చూసిన థియేటర్: మల్లికార్జున  కూకట్ పల్లి నటీనటులు:సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను తదితరులు బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఆర్ట్ డైరెక్టర్ – మురళి, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, […]

చెత్త మాట: చంద్రబాబు భయపడతారా!

నరేంద్రమోడీని చూసి చంద్రబాబు భయపడతారా? అన్న ప్రశ్న రాజ్యసభలో టిడిపి ఎంపి వేశారు. అసందర్భమైన ప్రశ్న ఇది. ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు భయపడుతున్నారనే వాదన ఉత్పన్నమవుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ, ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామి. కాబట్టి, చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాష్ట్రానికి గతంలో రాజ్యసభ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హోదా హక్కుని సాధించుకుని ఉండాలి. నరేంద్రమోడీ ప్రభుత్వం అంటే అందులో చంద్రబాబు కూడా భాగమే గనుక, ఇది చాలా సులువైన […]

వెంకయ్య బొంకు రామాయణం..

బీజేపీ లో వెంకయ్య నాయుడి రేంజే వేరు.పార్టీకి ఏసమస్యవచ్చినా వెంకయ్యే దారిచూపుతుంటారు.వెంకయ్య వాక్చాతుర్యం గురించి కొత్తగా చెప్పేదేముంది.అయన మైక్ పట్టుకుంటే ఎక్కడ మొదలెడుతారో ఎక్కడ ముగిస్తారో ఆయనకే తెలీదు.అలా తడుముకోకుండా అనర్గళంగా ఉపన్యాసాలు దంచేస్తారు ఈ నాయుడు గారు.అలాంటి ఈయన మన తెలుగోడు అవడం అందులోనా రాష్ట్రం విడిపోయి కష్టకాలం లో ఉన్న మనందరికీ వారమనుకున్నారు అందరు. అందులోనా ఈ నాయుడు గోరు అధికార బీజేపీ పార్టీ వాడు, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయం లో […]