ఏపీలో మ‌రో స్విస్ ఛాలెంజ్‌… న‌యా దోపిడీ చూస్తే షాకే..!

స్విస్ ఛాలెంజ్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. ఏపీ రాజ‌ధాని నిర్మాణాల‌కు సంబంధించి కొన్ని నెల‌ల కింద‌ట పెద్ద దుమారం రేపిన సంస్థ ఇది. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ అంటూ హ‌డావుడి చేసిన ఈ సంస్థ‌కు కాంట్రాక్టులు అప్ప‌గించాల‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ‌లు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, ఈ కాంట్రాక్టు సంస్థ పెట్టిన ష‌ర‌తులు, నిబంధ‌న‌లు ఏపీ రాష్ట్రం మెడ‌కు ఉచ్చుగా త‌గులుకుంటాయ‌ని తెలియడం ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. […]

స్విస్ ఛాలెంజ్‌లో మ‌రో ట్విస్ట్‌

ఏపీ రాజ‌ధానిలో కీల‌క‌మైన కోర్ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ విష‌యం మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. రాజ‌ధానిలోని ప్ర‌ధాన నిర్మాణాల‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధ‌తిలో నిర్మించాల‌ని సీఎం చంద్ర‌బాబు భావించారు. అయితే, ఈ విష‌యంలో ప‌లు సందేహాలు రావ‌డం.. విష‌యం కోర్టుల వ‌ర‌కు వెళ్ల‌డంతో దీనిపై వెన‌క్కి త‌గ్గారు. మ‌రో మార్గంలో రాజ‌ధాని నిర్మాణాల‌కు టెండ‌ర్లు పిలుస్తామ‌ని కోర్టు కు విన్న‌వించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా టెండ‌ర్ల‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇప్పుడైనా కొత్త విధానాన్ని రూపొందించారా? అంటే అది సందేహం […]

స్విస్ ఛాలెంజ్ నుంచి బాబు బ‌య‌ట‌ప‌డే య‌త్నం

ఏపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టిన స్విస్ ఛాలెంజ్ విష‌యంలో బ‌య‌ట‌ప‌డేందుకు బాబు ప్రయ‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టులో దీనిపై కేసు న‌డుస్తుండ‌గానే ఈ టెండ‌ర్ విధానానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంగ‌ళ‌వారం జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి ఆమోదించాల‌ని చూస్తున్నారు. అయితే, ఒక ప‌క్క కోర్టులో కేసు న‌డుస్తుండ‌గానే.. దీనికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌స‌మ్మ‌తం అనే ప్ర‌శ్న ఉత్పన్న‌మ‌వుతోంది. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది […]

రాజకోట(అమరావతి) రహస్యం తెలుసా?

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన వివరాలు లేకపోవడంతో దానిని ఛాలెంజ్‌ చేయాలని భావిస్తున్న ఇతర నిర్మాణ సంస్థలు ఆయోమయంలో పడుతున్నాయి. కీలక వివరాలు ఉండాల్సిన చోట చుక్కలు (డాట్స్‌) మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆర్థిక అంశాలకు సంబందించిన ముఖ్యమైన వివరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సింగపూర్‌ సంస్థలకే నిర్మాణ పనులను […]

స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]

సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]