తుమ్మలతో రేవంత్..హస్తం గూటికే..సీటుపైనే చర్చ.!

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..నాలుగు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి చూస్తున్నారు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పార్టీ మార్పుపై ప్రచారం జరిగిన అది ఆచరణ కాలేదు. కానీ ఇప్పుడు ఆచరణ అయ్యే దిశగా వెళుతుంది. తుమ్మలని తాజాగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. దీంతో తుమ్మల కాంగ్రెస్ […]

మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?

రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]

పట్నంకు మంత్రి.. తుమ్మల-తీగల పొజిషన్ ఏంటి?

మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించి కే‌సి‌ఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 119 సీట్లకు గాను..ఒక్కసారే 115 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు. ఒక 9 చోట్ల సిట్టింగ్ సీట్లలో మినహా మిగతా సీట్లలో సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టి‌డి‌పి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం […]

బీఆర్ఎస్ లిస్ట్‌లో ట్విస్ట్‌లు..కేసీఆర్ టార్గెట్ 95..బీఆర్ఎస్‌కు సాధ్యమేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 100 రోజుల వరకు సమయం ఉందనే చెప్పవచ్చు. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు..కానీ ఈలోపే కే‌సి‌ఆర్ దూకుడు ప్రదర్శించారు. 115 మందితో అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేశారు. 119 సీట్లు ఉంటే 115 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్ల విషయం ఇంకా తేల్చలేదు. ఇక ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలని […]

ఎన్నికల ఎత్తులు..అభ్యర్ధులతో చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకునే దిశగా సి‌ఎం కే‌సి‌ఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి తెలంగాణలో అధికారం దక్కించుకున్న బి‌ఆర్‌ఎస్..మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు.  తాజాగా సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన..అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. బి‌ఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు చేసిన కార్యక్రమాలు గురించి […]

కాక రేపుతున్న తెలంగాణ పాలిట్రిక్స్…!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. […]

ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెడుతున్న ఎమ్మెల్సీలు….!

బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్‌ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్‌ […]

సీట్లు ఫైనల్..ఈ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నో.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి సత్తా చాటాలని చూస్తున్న కే‌సి‌ఆర్.. తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మొదట లిస్ట్ విడుదల చేయడంపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇక దాదాపు అభ్యర్ధులని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. సుమారు ఓ 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం మాత్రం లేదని సమాచారం. వారికి ఆల్రెడీ కే‌సి‌ఆర్..పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కే‌టి‌ఆర్, హరీష్ ద్వారా..వారిని బుజ్జగించే ప్రయత్నాలు […]

గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!

మరో మూడు రోజుల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 […]