కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?

గ‌తంలో ఒక‌ద‌శ‌లో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైపోయిన ద‌శ‌లో… కేసీఆర్ ఉద్య‌మానికి స‌జీవంగా ఉంచేందుకు ఆలోచ‌న కంటే ఆవేశం ఎక్కువ‌గా ఉండే యువ‌త‌ను న‌మ్ముకున్నారు. తెలంగాణ‌లోని కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో విద్యార్థుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారిలో విభ‌జ‌న ఉద్య‌మ జ్వాల‌లు ర‌గిలించారు. వారితో పాటు ప్ర‌జా సంఘాలు, ఉద్యోగ సంఘాల‌ సాయంతో ఉద్య‌మాన్ని మ‌లి ద‌శ‌కు తీసుకెళ్లి అంతిమంగా ల‌క్ష్యం సాధించ‌గ‌లిగారు. తాజ‌గా జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక హోదా అంశంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై […]

జగన్‌ పట్టువదలని విక్రమార్కుడు.

ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్‌ జగన్‌ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని […]

ప‌వ‌న్‌కు వారిద్ద‌రి క్లాస్ వ‌ర్క్ అవుట్ అవుతుందా..!

ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యం ఇంకా ప్ర‌జ‌ల్లోకి అంత‌గా వెళ్ల‌లేదు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, ఆయ‌న‌ను ఆరాధించే ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల్లోకి ప్యాకేజీ అస్స‌లు వెళ్ల‌లేదు. దీంతో ఇప్పుడు స్టేట్ టీడీపీ స‌హా నేష‌న‌ల్ బీజేపీల‌కు ఇది పెద్ద ప్రాబ్లంగా ప‌రిణ‌మించింది. 2014 ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చినా.. ఇప్పుడు విధిలేని ప‌రిస్థితిలోనే ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చామ‌ని కేంద్రం చెబుతోంది. అంతేకాదు, హోదాతో ఏమేమి ఈ […]

ప‌వ‌న్‌తో బీజేపీ రాజీ యత్నాలు

హోదా ప్ర‌క‌టించనందుకు ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో దూర‌మవుతున్న‌ మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. ముఖ్యంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తీవ్ర స్వ‌రంతో బీజేపీపై విరుచుకుప‌డుతున్నాడు. ద‌శ‌ల వారీ పోరాటానికి కార్యాచ‌ర‌ణ కూడా ప్ర‌క‌టించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భ‌విష్య‌త్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే ప‌వ‌న్‌ రంగంలోకి దిగ‌కుండా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జ‌న‌సేనానితో రాయ‌బారానికి దిగారు. `కాంగ్రెస్ వెన్నుపోటు […]

వెంక‌య్యా ఈ కుప్పి గంతులేంద‌య్యా..

`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామ‌ప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే!! `ఆకాశంలో స్కామ్‌, నీటిలో స్కామ్‌, గాలిలో స్కామ్ ఇలా వారి హ‌యాంలో అన్నింటిలోనూ స్కామ్‌లే` అని కాంగ్రెస్‌ను ఏకిపారేయాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే!! ప్రాస‌లు, పంచ్‌లు.. మాట‌ల తూటాల‌తో దాడి చేస్తారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని రాజ్య‌స‌భ‌లో పోరాడిన ఆయ‌నే ప్యాకేజీతో ఏపీకి లాభ‌మ‌ని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయ‌ని ప్లేట్ ఫిరాయించారు! విశాఖ‌కు రైల్వే జోన్ వ‌చ్చేలా కృషిచేస్తాన‌ని […]

ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు వెంకయ్యా.

కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారు పదే పదే కాంగ్రెసు పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో. కాంగ్రెస్‌ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన అధ్యాయం. దేశంలోనూ ఆ పార్టీకి ఉనికి చాలా తక్కువగానే ఉంది. కానీ ఉనికి కోల్పోయిన కాంగ్రెసు పార్టీని ప్రశ్నించి, తాను ఉనికిలోకి రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తాపత్రయ పడుతుండడం శోచనీయమే. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వెంకయ్యనాయుడు స్పష్టతనివ్వాలి. ఐదున్నర కోట్ల మంది సీమాంధ్రులు, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి […]

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకోసం ఏం చేస్తాడు?

లడ్డు కావాలా నాయనా..ఎం నాయనా ఇంకో లడ్డు కావాలా..అంటూ కాస్త కొంటెగా ..ఇంకాస్త ఆవేశంగా..అన్నిటికి మించి అగమ్య గోచరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ లో ప్రజాసంగించారు.తిరుపతి సభతోనే పవన్ పబ్లిక్ ప్రసంగాలపై సామాన్యులకి ఒక అంచనా వచ్చేసింది.ఇక కాకినాడ సభ లో పవన్ నుండి పెద్దగా ఎవ్వరూ ఏమి ఆశించింది లేదు అయితే గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక హోదా పైన కేంద్ర చెప్తున్నా వక్ర భాష్యం దానికి […]

టీడీపీ ఎవరికోసం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా విషయం పై రగిలిపోతుంటే అధికార టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన అతి పెద్ద సమస్య ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు జరుగుతున్న శాసనసభలో దానికి మించిన సమస్య ఇంకేమిలేదు అయితే దానిగురించి చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే ఎందుకు అధికార టీడీపీ జరిపించటం లేదు? ప్రత్యేకహోదాకంటే పెద్ద సమస్య ఇంకేమైనా ఉందా? ప్రత్యేక హోదా ఎమన్నా ప్రతిపక్ష […]

ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]