మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?

జిల్లా కేంద్ర‌మైన క‌ర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి ఫ‌స్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహ‌న్‌రెడ్డి దివంగ‌త భూమా దంప‌తుల్లో శోభ‌కు స్వ‌యానా సోద‌రుడు కాగా, నాగిరెడ్డికి బావ‌మ‌రిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌ట‌కీ రాజ‌కీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించ‌కపోవ‌డం ఓ మైన‌స్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మార‌డం మ‌రో మైన‌స్‌. ఇక అధికార పార్టీలోకి వ‌చ్చినా […]

ఆ పొలిటిక‌ల్ సినిమాకు శుభం కార్డు

భార‌త దేశ రాజ‌కీయాలను నిశితంగా గ‌మ‌నిస్తే.. రెండు విష‌యాలు స్ప‌ష్ట‌మ‌వుతాయి. దేశాన్ని పాలిస్తున్న‌ది రెండే రెండు జాతీయ పార్టీలు. ఒక‌టి కాంగ్రెస్ కాగా, రెండోది బీజేపీ. ఈ రెండు మిన‌హా దేశాన్ని పాలించిన పార్టీలు లేవ‌నే చెప్పాలి. అయితే, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా అవి వాటి అస్తిత్వం కోస‌మే పోరు చేయ‌డంలో టైం గ‌డిచి పోతోంది. దీంతో ఇక‌, భార‌త్ వంటి ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం దేశంలో కేవ‌లం రెండు […]

జగన్ చెంతకు ముద్ర‌గ‌డ…ఎంపీగా పోటి అక్కడ నుండే

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పొలిటిక‌ల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స‌యిపోయిందా? ఆయ‌న ప్ర‌ధాన విప‌క్షం జ‌గ‌న్ పార్టీ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఔన‌నే అంటున్నారు తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయ నేత‌లు. విష‌యంలోకి వెళ్తే.. గ‌డిచిన రెండేళ్లుగా ముద్ర‌గ‌డ ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా క‌నిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాపు ల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు తాత్సారం చేస్తున్నార‌ని ఆయ‌న ప‌దే ప‌దే విమ‌ర్శించ‌డ‌మే కాకుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ సాధించేందుకు ఆయ‌న అలుపెరుగ‌ని కృషి చేస్తున్నారు. త‌న […]

ముమైత్‌ను సిట్ అడిగిన ప్ర‌శ్న‌లు ఇవే

టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపిన డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు వ‌రుస‌గా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సిట్ 8వ రోజు ప్ర‌ముఖ ఐటెం గ‌ర్ల్ మ‌మైత్‌ఖాన్‌ను విచారిస్తున్నారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మ‌మైత్‌కు పోలీసులు ప్ర‌త్యేకంగా వెళ్లి మ‌రీ నోటీసులు జారీ చేశారు. ఇక గురువారం ప‌వ‌న్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మ‌హిళా అధికారుల బృందం మ‌మైత్‌ను విచారిస్తోంది. మ‌మైత్‌పై సిట్ బృందం ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తోంది. నాంప‌ల్లిలోని […]

నంద్యాల ఉప ఎన్నిక న‌గరా మోగింది

ఏపీతో పాటు తెలంగాణ‌లోను ఉత్కంఠ రేపుతోన్న ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికకు న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నంద్యాల ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో టీడీపీలోకి జంప్ అయ్యారు. త‌ర్వాత ఆయ‌న గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే […]

బిగ్ బాస్ నుంచి జంప్‌… సంపూ క‌ట్టే పెనాల్టీ తెలిస్తే షాకే

బిగ్ బాస్ షో నుంచి సంపూ అర్దాంత‌రంగా వెళ్లిపోవ‌డం బిగ్ బాస్ అభిమానుల‌కు పెద్ద షాక్‌. బిగ్ బాస్ అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక సంపూ తాను ఇక్క‌డ ఉండ‌లేన‌ని బిగ్ బాస్‌ను వేడుకోవ‌డంతో బిగ్ బాస్ సంపూను బ‌య‌ట‌కు పంపేశాడు. సంపూ బిగ్ బాస్ హౌస్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి బ‌య‌ట‌కు వెళ్లినందుకు గాను సంపూకు భారీ పెనాల్టీ ప‌డింద‌ట‌. దాదాపుగా రూ.16 ల‌క్ష‌లు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సివ‌చ్చింద‌ని […]

బీహార్ లో వెనక జరిగిన రాజకీయం ఇదే….!

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు.. కాలం ఖ‌ర్మ‌కాలితే అతిత్వ‌ర‌లోనే ఆ పార్టీకి అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్ప‌బోయే గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు ముసురుకున్నాయి. అస‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణ‌తి ఎంత‌? ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దాని ఆనుపానులు తెలిసిన‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న చూపుతున్న సామ‌ర్థ్యం ఏపాటిది? అస‌లు రాహుల్‌కి రాజ‌కీయాలు ఇష్టం లేదా? ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ఆయ‌న‌ను చుట్టుముడుతోంది. దీనంత‌టికీ కార‌ణం.. బిహార్‌లో కేవ‌లం క‌న్ను మూసి క‌న్ను తెరిచేలోగా […]

టీజ‌ర్‌లోనే టీడీపీ క‌థ క్లోజ్‌…ఇక మిగిలింది సినిమాయే

ఎస్ ఈ హెడ్డింగ్ నిజ‌మే అనిపిస్తోంది ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి చూస్తుంటే… తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు చేసేసింది. దీంతో టీడీపీ నేత‌లు త‌మ దారి తాము చూసుకోక తప్ప‌డం లేదు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడును త‌ట్టుకుని నిల‌బ‌డే స‌త్తా త‌మ‌కు లేద‌ని తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ కాస్తో కూస్తో మంచి ఫ‌లితాలే సాధించిన టీడీపీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పూర్తిగా తేలిపోయింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం ఒక్క […]